గుమ్మడికాయ కొట్టేసిన బాలయ్య

Published on Nov 29,2019 04:17 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ రూలర్ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసాడు. నిన్నటితో రూలర్ చిత్రం షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. దాంతో మిగిలిన కార్యక్రమాలను పూర్తిచేసి డిసెంబర్ 20 న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

బాలయ్య సరసన వేదిక , సోనాల్ చౌహన్ లు నటిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య డిఫరెంట్ గెటప్ లలో కనిపిస్తున్నాడు దాంతో ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తున్నాయి. డిసెంబర్ 20 న సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ రెండో వారంలో రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తో ఘోరమైన పరాజయాలను ఎదుర్కొన్న బాలయ్య ఈ రూలర్ తో హిట్ అందుకుంటాడా ? లేదా ? అన్నది తేలాల్సి ఉంది.