రూలర్ గా అదరగొట్టిన బాలయ్య

Published on Nov 21,2019 06:41 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ రూలర్ గా అదరగొట్టాడు. తాజాగా రూలర్ టీజర్ ని విడుదల చేశారు. ఆ టీజర్ లో బాలయ్య డైలాగ్స్ చెబుతుంటే , యాక్షన్ సీన్స్ లో రెచ్చిపోతుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అంతగా అదరగొట్టాడు బాలకృష్ణ. పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా అలాగే స్టైలిష్ లుక్ లో రెండు వేరియేషన్స్ ఉన్నాయి బాలయ్య గెటప్ లో. 

బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్ , వేదిక  ముద్దుగుమ్మలిద్దరూ నటించారు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మించాడు. భారీ డైలాగ్స్ కు పెట్టింది పేరు బాలయ్య అలాంటిది బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉంటాయా ? టీజర్ తో ఫ్యాన్స్ ని ఖుషీ చేసిన బాలయ్య త్వరలోనే ట్రైలర్ తో మరోసారి సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ రూలర్ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.