బాలయ్య రూలర్ కలెక్షన్స్

Published on Dec 22,2019 09:25 AM
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ విడుదలైన విషయం తెలిసిందే. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మించారు. ఇక నిన్నటి రోజున ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 9 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించింది. దాంతో 4కోట్ల 30 లక్షల వరకు షేర్ వచ్చింది. అయితే ఈ సినిమా హిట్ కావాలంటే రెండు తెలుగు రాష్ట్రాలలో 21 కోట్ల షేర్ రాబట్టాలి కానీ ఓపెనింగ్స్ చూస్తుంటే ఆ స్థాయిలో లేవు దాంతో ఈ సినిమాని కొన్న వాళ్లకు నష్టాలు రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే బిసి కేంద్రాల్లో మాత్రం కాస్త బాగానే వసూళ్లు వచ్చేలా కనబడుతున్నాయి. బాలయ్య డైలాగ్స్ , డ్యాన్స్ కి ఈ వసూళ్లు వస్తున్నాయి కాకపోతే టాక్ మాత్రం చాలా నెగెటివ్ ఉంది. బాలయ్య సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు వేదిక , సోనాల్ చౌహన్ లు నటించగా కీలక పాత్రల్లో జయసుధ , భూమిక , ప్రకాష్ రాజ్ లు నటించారు.

రూలర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇలా ఉన్నాయి

నైజాం                    -  68 లక్షలు

సీడెడ్                     -  1. 08 కోట్లు

ఈస్ట్                        -  27 లక్షలు

వెస్ట్                         -  26 కోట్లు

గుంటూరు               -  1. 30 కోట్లు

కృష్ణా                       -  20 లక్షలు

నెల్లూరు                  -   22 లక్షలు

ఉత్తరాంధ్ర              -  28 లక్షలు

మొత్తం                    - 4. 29 కోట్లు