బాలయ్య పోలీస్ గెటప్ ఇలా ఉందేంటి ?

Published on Oct 26,2019 05:33 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న రూలర్ చిత్రంలోని పోలీస్ గెటప్ ని ఈరోజు రివీల్ చేసారు. రేపు దీపావళి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పోలీస్ గెటప్ లో ఉన్న బాలయ్య లుక్ ని విడుదల చేసారు ఆ చిత్ర బృందం. తమిళ దర్శకులు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని బాలయ్య గెటప్ పట్ల పలువురు పెదవి విరుస్తున్నారు.
                  పెద్ద సుత్తి పట్టుకొని ఉన్న బాలయ్య పవర్ ఫుల్ గానే ఉన్నాడు కానీ అభిమానులు ఆశించే స్థాయిలో లేడు అలాగే అభిమానులను సంతృప్తి పరిచేలా లేదు బాలయ్య గెటప్. ఇక ఈ చిత్రానికి రూలర్ అని కన్ఫర్మ్ చేసారు. ఈ రూలర్ చిత్రాన్ని డిసెంబర్ 20 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆశించిన ఫలితం పొందుతుందా ? అంటే అప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి.