ట్రైలర్ బాగుంది కానీ బాలయ్య లుక్కే దెబ్బకొట్టింది

Published on Dec 09,2019 07:45 PM

రూలర్ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరో కావడంతో ఆ రేంజ్ లోనే డైలాగ్స్ ఉన్నాయి. అయితే రూలర్ ట్రైలర్ బాగుంది , నందమూరి అభిమానులను మాత్రమే కాకుండా యాక్షన్ కోరుకునే ప్రేక్షకులకు కూడా నచ్చేలా ఉంది కానీ బాలయ్య పోలీస్ ఆఫీసర్ లుక్కు మాత్రం చాలా దెబ్బకొట్టింది. బాలయ్య లుక్కు చూసి షాక్ అవుతున్నారు. పోలీస్ కు ఉండాల్సిన గెటప్ కాదు అది అని ఫీల్ అవుతున్నారు.

అయితే ఇదే చిత్రంలో బాలయ్య మరో లుక్ లో కనిపిస్తున్నాడు ఆ లుక్ మాత్రం అదిరిపోయేలా ఉంది దాంతో కొంత శాటిస్ఫాక్షన్ అన్నమాట. బిజినెస్ మెన్ గా బాలయ్య లుక్ కు పెద్ద ఎత్తున అప్లాజ్ వస్తోంది కానీ పోలీస్ లుక్ మాత్రం దెబ్బకొట్టిందని వాపోతున్నారు. ఇక ఈ రూలర్ చిత్రం ఈనెల 20 న విడుదల కానుంది. సినిమా విడుదల అయితే కానీ తెలీదు రూలర్ రూల్ చేస్తుందా ? చతికిల బడుతుందా ? అన్నది.