రేటు పెంచిన బాలయ్య

Published on Oct 29,2019 03:52 PM
రేటు పెంచిన బాలయ్య
నటసింహం నందమూరి బాలకృష్ణ తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసాడు. తాజాగా రూలర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న రూలర్ చిత్రం కోసం ఏకంగా 14 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఇంతకుముందు 7 నుండి 10 కోట్ల మధ్య తీసుకునేవాడు బాలయ్య అయితే తాజాగా మాత్రం రూలర్ కోసం ఏకంగా 14 ఇవ్వాలని రూలింగ్ ఇచ్చాడట.

ఇక బాలయ్య తో ఇంతకుముందే జైసింహ అనే చిత్రం నిర్మించి బాగానే సొమ్ము చేసుకున్నాడు కళ్యాణ్ అనే నిర్మాత దాంతో ఇప్పుడు బాలయ్య అడిగినంత ఇచ్చుకోవడానికి రెడీ అయ్యాడట ఈ నిర్మాత. రూలర్ చిత్రాన్ని డిసెంబర్ 20 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా హిట్ అవుతుందా ? మళ్ళీ బాలయ్య కు హిట్ నిస్తుందా ? చూడాలి.