ఆదిత్య 999 చేయనున్న బాలయ్య

Published on Dec 22,2019 09:14 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ ఆదిత్య 999 అనే చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. 1991 లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రయోగాత్మక చిత్రంగా ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంది. దాంతో ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు కానీ కుదరలేదు కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత బాలయ్య ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ గా ''ఆదిత్య 999'' అనే టైటిల్ తో సినిమా చేయాలనీ భావిస్తున్నాడు.

ఇక ఈ సీక్వెల్ చిత్రానికి బాలయ్యే దర్శకత్వం వహించాలని చూస్తున్నాడు. ఈ సీక్వెల్ కు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే సింగీతం వయసు దృష్ట్యా వీలు పడకపోవచ్చని , అందుకు బాలయ్య కూడా అంగీకారం తెలపడం కష్టమే అని అంటున్నారు. అందుకే సింగీతం కు బదులుగా బాలయ్యే దర్శకత్వం వహించడం ఖాయమని అంటున్నారు. ఆదిత్య 999 కథ అద్భుతంగా వచ్చిందని అంటున్నాడు బాలయ్య. అయితే సినిమా వస్తే కానీ తెలీదు బాగుందా ? లేదా ? అన్నది.