యాక్షన్ సాంగ్ అంటూ వచ్చిన బాలయ్య

Published on Dec 01,2019 06:16 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ రూలర్ చిత్రంలోని పాట ని తాజాగా విడుదల చేసారు. కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న రూలర్ చిత్రంలోని '' అడుగడుగో యాక్షన్ హీరో '' అనే పాటని విడుదల చేసారు. ఈ పాటలో బాలయ్య మంచి జోష్ తో కనిపిస్తున్నాడు. అలాగే బాలయ్య గెటప్ కూడా నందమూరి అభిమానులను విశేషంగా అలరించేలా ఉంది.

రూలర్ గా బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నాడా ? లేదా అన్నది సినిమా విడుదల అయ్యాక మాత్రమే తేలనుంది ఎందుకంటే బాలయ్య అడుగడుగో యాక్షన్ హీరో అనే పాటలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దాంతో బాలయ్య రెండు వేరియేషన్స్ లో కనిపించనున్నాడా ? అంటే సినిమా విడుదల అయితే కానీ తెలీదు. ఇక ఈ సినిమా డిసెంబర్ 20 న విడుదల కానుంది.