బాలయ్య సినిమాకి నిర్మాత మారాడు

Published on Mar 06,2019 03:47 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్దమైన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాని తన సొంత బ్యానర్ లో తీయాలని అనుకున్నాడు . కానీ ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ కూడా ఘోర పరాజయం పొందడంతో ఖంగుతిన్న బాలయ్య సొంత చిత్ర నిర్మాణాన్ని పక్కన పెట్టాడు . దాంతో సి . కళ్యాణ్ కు ఈ సినిమా అప్పగించాడట . 

బాలయ్య తో మళ్ళీ సినిమా చేయాలనీ సి . కళ్యాణ్ సన్నాహాలు చేసాడు కానీ అది కుదరలేదు , కథ సెట్ కాలేదు దాంతో ఆ సినిమాని పక్కన పెట్టి ఈ సినిమాని నిర్మించమని బాలయ్య కోరాడట ! దాంతో సి . కళ్యాణ్ ముందుకు వచ్చాడు . అయితే ఈ సినిమా ఇప్పట్లో ఉండదు ఎందుకంటే ఏప్రిల్ , మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నందున జూన్ లోకాని జులై లో కానీ బాలయ్య - బోయపాటి సినిమా ఉండొచ్చు .