ఎన్టీఆర్ ని పట్టించుకోని బాలయ్య

Published on Apr 27,2020 02:20 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పట్టించుకున్న పాపాన పోలేదు దాంతో బాలయ్య బాబాయ్ కి సవాల్ విసిరాను కదా దాన్ని స్వీకరిస్తాడు అని ఆశపడిన ఎన్టీఆర్ కు అలాగే నందమూరి అభిమానులకు గట్టి షాక్ ఇచ్చాడు బాలయ్య. బాబాయ్ బాలయ్య మాత్రమే కాదు నాగార్జున బాబాయ్ కూడా ఎన్టీఆర్ ఛాలెంజ్ ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఇద్దరు కూడా ఎన్టీఆర్ విసిరిన సవాల్ కు ఇంతవరకు కూడా సమాధానం ఇవ్వలేదు.

బాలయ్య బాబాయ్ తో ఎన్టీఆర్ కు అంత సవ్యమైన సంబంధాలు ఏమి లేవు. ఏదో కలిసాం అంటే కలిసాం అంటూ ఉన్నట్లుగా ఉన్నారు కానీ ఆ ప్రేమ ఆప్యాయతలు మాత్రం లేవు. అయినప్పటికీ ఈ కరోనా సమయంలో అబ్బాయ్ విసిరిన సవాల్ ని బాలయ్య స్వీకరిస్తాడేమో అని ఆశించారు అభిమానులు. బాలయ్య విషయాన్నీ పక్కన పెడితే నాగార్జున కూడా స్పందించలేదు. బాలయ్య ఏమో క్యాన్సర్ ఆసుపత్రిలో ఉన్న స్టాఫ్ కు నిత్యావసరాలు ఇచ్చాడు , నాగార్జున సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నాడు కానీ ఎన్టీఆర్ సవాల్ పై లుక్కేయలేదు మరి.