ఆ సినిమాలో బాలకృష్ణ పాత్ర లేదట

Published on Nov 20,2019 03:35 PM

రాంగోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం '' కమ్మరాజ్యంలో కడపరెడ్లు '' . త్వరలోనే విడుదలకు సిద్దమైన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ పాత్ర లేదని తేల్చి చెప్పాడు వర్మ. ఈ వివాదాస్పద చిత్రంలో చంద్రబాబు , లోకేష్ , జగన్ తదితర పాత్రలు ఉన్నాయి అయితే నందమూరి బాలకృష్ణ పాత్ర కూడా ఉందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్న వాళ్లకు క్లారిటీ ఇస్తున్నాడు వర్మ బాలయ్య పాత్ర లేదని.

అంతేకాదు భవిష్యత్ లో బాలకృష్ణ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా నేను చేయను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ. అసలు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించాలని ఆశపడ్డాడు , బాలయ్య వెంట పడ్డాడు కానీ ఎందుకో బాలయ్య వర్మ ని పట్టించుకోలేదు దాంతో వర్మకు బాలయ్య అంటే విపరీతమైన కోపం ఏర్పడింది కానీ బాలయ్య ని మాత్రం ఎక్కడా అవమానించలేదు తన సినిమాలలో. అయితే చంద్రబాబు ని అలాగే బాలయ్య అల్లుడు లోకేష్ ని మాత్రం వదిలిపెట్టడం లేదు పాపం. ఇప్పటికే ఘోర ఓటమి చవి చూసి ఉన్న వాళ్లపై వర్మ బాగానే ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.