బాలయ్య సినిమాని రిజెక్ట్ చేసిన భామ

Published on Dec 17,2019 09:49 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే నిర్మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసింది బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. పైగా ఈ విషయాన్నీ ట్వీట్ చేసి మరింత సంచలనం సృష్టించింది. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో నేను హీరోయిన్ గా నటిస్తున్నట్లు రకరకాల వార్తలను చూస్తున్నాను, నేను ఆ సినిమాలో నటించడం లేదు అలాగే నా కొత్త సినిమా ఏంటి ? అన్న వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాను అంటూ ట్వీట్ చేసింది సోనాక్షి సిన్హా.

సింహా . లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. దాంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావడానికి బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ని తీసుకోవాలని నిర్ణయించారట. దాంతో ఆమెని సంప్రదించారు కానీ ఆ భామ మాత్రం బాలయ్య సినిమాని రిజెక్ట్ చేసింది. దాంతో ఖంగుతిన్న చిత్ర బృందం మరో హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు. సీనియర్ హీరో బాలయ్య కు హీరోయిన్ ల కొరత చాలా ఉంది. బాలయ్య నటించే ప్రతీ సినిమాకు హీరోయిన్ లను వెతికే పనితో దర్శక నిర్మాతలకు తల ప్రాణం తోక కొస్తోంది పాపం.