50 కోట్ల క్లబ్ లో బాలా

Published on Nov 13,2019 05:39 PM

నవంబర్ 7 న విడుదలైన '' బాలా '' 50 కోట్ల క్లబ్ లో చేరింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా భూమి పెడ్నేకర్ , యామీ గౌతమ్ హీరోయిన్ లుగా నటించారు. ఇక ఈ చిత్రానికి అమర్ కౌశక్ దర్శకత్వం వహించాడు. బట్టతల ఉన్నవాళ్ళ కష్టాలను ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేలా చిత్రీకరించాడు దర్శకుడు అమర్ కౌశక్. అలాగే ఆయుష్మాన్ ఖురానా నటన కూడా ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది.

బట్టతలతో హీరో పడే బాధ , నరకయాతన ఎలా ఉంటుందో ఆయుష్మాన్ ఖురానా అద్భుతంగా నటించాడు. సీరియస్ అంశం అయినప్పటికీ తెరమీద ఎంటర్ టైనర్ గా మలచడంలో దర్శకుడు అమర్ కౌశిక్ ని తప్పకుండా అభినందనలు తెలియజేయాల్సిందే. అంతగా ఆకట్టుకునేలా నటీనటుల నుండి నటన రాబట్టుకోవడమే కాకుండా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడు అందుకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 4 రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది '' బాలా '' చిత్రం. ఇక విభిన్న కథా చిత్రాలతో దూసుకుపోతున్న ఆయుష్మాన్ ఖురానా పై ప్రశంసల వర్షం కురుస్తోంది.