బండ్ల గణేష్ కు ఆ మంత్రి వల్లే బెయిల్ వచ్చిందా ?

Published on Oct 25,2019 04:39 PM

నిర్మాత , నటుడు బండ్ల గణేష్ అరెస్ట్ వ్యవహారం టాలీవుడ్ లో కలకలం రేపింది. నిర్మాత పివిపి ఫిర్యాదు తో పాటుగా ప్రొద్దుటూరు లో కూడా బండ్ల గణేష్ పై చెక్ బౌన్స్ కేసులున్నాయి దాంతో బండ్ల గణేష్ ని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. అక్కడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది అయినప్పటికీ బండ్ల గణేష్ కు వెంటనే బెయిల్ మంజూరు అయ్యింది దాంతో బండ్ల గణేష్ కు ఆంధ్రప్రదేశ్ లోని ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయని అందుకే బెయిల్ వచ్చిందని గుసగుసలు వినబడుతున్నాయి.
గతంలో కూడా బండ్ల గణేష్ నిర్మాత కావడానికి ఆ మంత్రి కారకుడు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన బండ్ల గణేష్ ఆ మంత్రి అండదండలతోనే నిర్మాత అయ్యాడని అప్పటోలోనే గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు బెయిల్ రావడంతో ఆ వార్తలకు మరింత ఊపొచ్చింది.