అబ్బాయ్ టైటిల్ ని కొట్టేసిన బాబాయ్

Published on Oct 29,2019 08:06 PM

బాలయ్య బాబాయ్ అబ్బాయ్ ఎన్టీఆర్ టైటిల్ ని కొట్టేసాడు. అబ్బాయ్ టైటిల్ ని బాబాయ్ కొట్టేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రంలో రూలర్ అనే పాట బాగా పాపులర్ అయ్యింది దాంతో ఎన్టీఆర్ చిత్రానికి రూలర్ అనే టైటిల్ ని పెడతారని చాలాసార్లు అనుకున్నారు కానీ కుదరలేదు కట్ చేస్తే ఇప్పుడు అదే టైటిల్ ని బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రానికి రూలర్ అనే టైటిల్ పెట్టారు.

తమిళ దర్శకుడు కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. దాంతో ఆ చిత్రానికి రూలర్ అని పెట్టారు ఇంకేముంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య బాబాయ్ మా హీరో టైటిల్ ని కొట్టేసాడు అని ప్రచారం చేస్తున్నారు.