హర్రర్ సినిమాలో అవికా గోర్

Published on Sep 03,2019 09:37 AM

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న భామ అవికా గోర్ , తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ కొంత గ్యాప్ ఇచ్చింది అయితే మళ్ళీ రాజుగారి గది 3 తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజుగారి గది హిట్ కావడంతో దానికి కొనసాగింపుగా రాజుగారి గది 2 చేసాడు , అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు అయినప్పటికీ ఇప్పుడు రాజుగారి గది 3 తీస్తున్నాడు. 
ఆ హర్రర్ సినిమాలో అవికా గోర్ దెయ్యం గా నటిస్తోంది. తాజాగా అవికా గోర్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు ఆ చిత్ర బృందం. హర్రర్ సినిమాలకు ఆదరణ లభిస్తుండటంతో ఆ వరుసలో చాలా సినిమాలే వస్తున్నాయి. ఇక ఓంకార్ కూడా మళ్ళీ దెయ్యాన్నే నమ్ముకున్నాడు విజయం కోసం. అవికా గోర్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ రాజుగారి గది 3 ఏమౌతుందో చూడాలి ...... ఇక ఈ సినిమాని అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల చేయనున్నారు.