అల్లు అర్జున్ తో నటించడం ఈ భామకు ఇష్టం లేదా ?

Published on Dec 06,2019 12:30 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ అవికా గోర్. ఇంతకీ ఈ భామ ఏమందో తెలుసా ...... అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ లభిస్తే చేస్తావా ? అని అడిగిన ప్రశ్నకు ''ఏంటి ...... నేను హాయిగా ఉండటం మీకు ఇష్టం లేదా ? అల్లు అర్జున్ తో నటించి అంత ఫాస్ట్ గా డ్యాన్స్ చేయగలనా ? నాకాళ్ళు విరిగిపోవూ '' అంటూ సమాధానం ఇచ్చింది అవికా గోర్. అంటే ఈ సమాధానం ప్రకారం అల్లు అర్జున్ తో నటించడం అవికా గోర్ కు ఇష్టం లేదనే అర్ధమేగా ?

చిన్నారి పెళ్లికూతురు గా ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. ఇటీవలే రాజుగారి గది 3 లో నటించిన ఈ భామకు అల్లు అర్జున్ అంటే ఇష్టమేనట ! కాకపోతే అల్లు అర్జున్ పక్కన నటించడం అంటే డ్యాన్స్ చేయాలి కదా ! అల్లు అర్జున్ అంత ఫాస్ట్ గా డ్యాన్స్ చేయలేదు కదా అందుకే భయపడుతోంది అవికా గోర్.