అశ్వథామ ట్రైలర్ బాగానే ఉంది కానీ ...

Published on Jan 24,2020 09:44 PM

నాగశౌర్య హీరోగా నటించిన అశ్వథామ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 30 న విడుదల చేస్తున్నారు. నాగశౌర్య సొంత సినిమా అశ్వథామ కావడం విశేషం. అయితే నాగశౌర్యకు లవర్ బాయ్ ఇమేజ్ మాత్రమే ఉంది. కానీ యితడు మాత్రం యాక్షన్ హీరో ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్నాడు. ఇంతకుముందు కూడా పలుమార్లు యాక్షన్ హీరోగా ట్రై చేసి దారుణంగా దెబ్బతిన్నాడు దాంతో కొద్దిరోజులు సైలెంట్ అయ్యాడు.

కట్ చేస్తే ఛలో సూపర్ హిట్ కావడంతో మళ్ళీ ఆశలు చిగురించినట్లున్నాయి అందుకే అశ్వథామ అంటూ యాక్షన్ ఇమేజ్ కోసం వస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకునేలాగే ఉంది. ట్రైలర్ బాగుంది కానీ సినిమా హిట్ అయ్యేంత సరుకు అందులో ఉందా ? నాగశౌర్య యాక్షన్ హీరోగా నిలబడతాడా ? అన్నది మాత్రం జనవరి 30 నే తేలనుంది ఎందుకంటే ఆరోజే సినిమా విడుదల అయ్యేది మరి.