అశ్వద్ధామ ఫస్ట్ డే కలెక్షన్స్

Published on Feb 01,2020 07:03 PM

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం అశ్వద్ధామ. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న విడుదల అయ్యింది. మెహరీన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూళ్ళని వసూల్ చేసింది. నాగశౌర్య కెరీర్ లో ఇదే బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో మంచి ఓపెనింగ్స్ లభించాయనే చెప్పాలి.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ లభించాయి దాంతో మూడున్నర కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈరోజు తగ్గే అవకాశం ఉంది అలాగే ఆదివారం రోజున కూడా. అయితే సోమవారం రోజున అసలైన పరీక్ష ఎదురుకానుంది నాగశౌర్యకు. ఈ నాలుగు రోజులు బాగా పిండుకుంటే వచ్చే వారం మరో సినిమా విడుదల కానుంది. అలాగే ఫిబ్రవరి 14 న విజయ్ దేవరకొండ సినిమా వస్తోంది కాబట్టి ఈలోపు ఎంత వసూల్ చేస్తే అంత మంచిది నాగశౌర్య కు.