అర్జున్ సురవరం టీజర్ టాక్

Published on Mar 05,2019 03:52 PM

తమిళంలో విజయం సాధించిన కనితన్ చిత్రాన్ని తెలుగులో అర్జున్ సురవరం గా రీమేక్ చేసాడు హీరో నిఖిల్ . గతకొంత కాలంగా నిఖిల్ కు సరైన సక్సెస్ లేదు అయితే ఆ లోటుని అర్జున్ సురవరం భర్తీ చేసేలా ఉంది . ఎందుకంటే నిన్న ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయ్యింది . ఈ చిత్రంలో నిఖిల్ రిపోర్టర్ గా నటిస్తున్నాడు . మీడియాలో జరుగుతున్న అనూహ్య పోకడల ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందింది . 

తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన టి . సంతోష్ ఈ తెలుగు చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం . ఇక టీజర్ చూస్తుంటే తప్పకుండా నిఖిల్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది . ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మార్చి 29 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటించింది . టీజర్ కు మంచి స్పందన రావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది .