హిట్ టాక్ అయితే వచ్చింది కానీ ...

Published on Nov 30,2019 11:19 AM

నిఖిల్ నటించిన '' అర్జున్ సురవరం '' నిన్న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కు యునానిమస్ గా హిట్ టాక్ వచ్చింది దాంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. అయితే సినిమాకు హిట్ టాక్ అయితే వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో అయితే ఓపెనింగ్స్ రాలేదు దాంతో ప్రమోషన్ కార్యక్రమాలకు మరింత ఊపొచ్చేలా చేస్తున్నారు. అలాగే టాక్ స్ప్రెడ్ అయి ఈరోజు నుండి కలెక్షన్లు పెరుగుతాయని భావిస్తున్నారు.

ఎలాగూ పెద్ద సినిమాలు లేవు కాబట్టి పోటీ లేదు దాంతో తప్పకుండా కలెక్షన్లు మెరుగు అవుతాయని ఆశిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన కనితన్ చిత్రాన్ని తెలుగులో అర్జున్ సురవరం గా రీమేక్ చేసారు అయితే విడుదలలో ఏడాదికి పైగా ఆలస్యం కావడంతో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ లభించలేదు కానీ టాక్ బాగుంది కాబట్టి తప్పకుండా మంచి వసూళ్లు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.