ఈనెల 22న విడుదల కానున్న తమిళ అర్జున్ రెడ్డి

Published on Nov 17,2019 08:31 AM

తెలుగునాట సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో '' ఆదిత్య వర్మ '' గా రీమేక్ చేసారు. తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఈ ఆదిత్య వర్మ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అన్ని అడ్డంకులు పూర్తి చేసుకొని ఈనెల 22 న విడుదలకు సిద్ధమైంది తమిళ అర్జున్ రెడ్డి. అసలు ఈ సినిమా ఈనెల 8 న విడుదల కావాల్సి ఉండే కానీ సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి దాన్ని మార్చాలని కోరారు చిత్ర బృందం.

కానీ సెన్సార్ వాళ్ళు దర్శక నిర్మాతల అభ్యర్ధనని పట్టించుకోకపోవడంతో ఎట్టకేలకు ఈనెల 22న విడుదల చేస్తున్నారు. ట్రైలర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది దాంతో ఆదిత్య వర్మ పై భారీ అంచనాలు నెలకొన్నాయి దానికి తోడు విక్రమ్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి విక్రమ్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. మరి హీరోగా విక్రమ్ తనయుడు ధృవ్ ఆకట్టుకుంటాడా ? లేదా ? అన్నది ఈనెల 22న తేలిపోనుంది.