అర్జున్ రెడ్డి హీరోయిన్ కి బంపర్ ఆఫర్

Published on Jan 23,2019 09:51 AM

అర్జున్ రెడ్డి చిత్రంలో చాలా బోల్డ్ గా నటించి సంచలనం సృష్టించిన భామ షాలిని పాండే టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుదామని ఆశించింది . అర్జున్ రెడ్డి ప్రభంజనం సృష్టించినప్పటికీ ఈ భామకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు . కాకపోతే చిన్న చిన్న వేషాలు వచ్చాయి మహానటి లో అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో.

అయితే వీటితో పాటుగా తెలుగులో మరో రెండు చిత్రాలు చేసున్న ఈ భామకు బాలీవుడ్ లో నటించే బంపర్ ఆఫర్ వచ్చింది . టాలీవుడ్ లో మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ భామకు ఏకంగా బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ లభించడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది . ఈ చాన్స్ తో బాలీవుడ్ లో మరిన్ని ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.