తమిళంలో రిలీజ్ అవుతున్న అర్జున్ రెడ్డి

Published on Feb 28,2019 03:54 PM

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి తెలుగునాట ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే . అయితే ఆ అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు యంగ్ హీరో ధృవ్ . తాజాగా తమిళనాట అర్జున్ రెడ్డి చిత్రం రిలీజ్ కి సిద్ధమైంది . అయితే ఈ అర్జున్ రెడ్డి తమ తెలుగు అర్జున్ రెడ్డి కాదు సుమా ! ద్వారకా అనే తెలుగు చిత్రాన్ని తమిళంలో అర్జున్ రెడ్డి అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు . 

విజయ్ దేవరకొండ ద్వారకా అనే చిత్రంలో నటించగా అది తెలుగులో అంతగా ఆడలేదు కాకపోతే అర్జున్ రెడ్డితో ఈ హీరోకు ఎనలేని డిమాండ్ ఏర్పడటంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ద్వారకా చిత్రాన్ని అర్జున్ రెడ్డి పేరుతో డబ్ చేసారు . మార్చి 15 న ఈ సినిమా రిలీజ్ కానుంది .