అర్జున్ రెడ్డి అక్కడ కూడా హిట్టే !

Published on Nov 23,2019 06:50 PM

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం తెలుగులోనే కాకుండా హిందీ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయితే అక్కడ కూడా బాక్స్ లు బద్దలు కొట్టి సంచలన విజయం సాధించింది, ఇక ఇప్పుడేమో తమిళంలో కూడా సూపర్ హిట్ అయ్యింది అర్జున్ రెడ్డి అలియాస్ ఆదిత్య వర్మ. చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ హీరోగా తమిళ అర్జున్ రెడ్డి చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. తమిళంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది గిరీశాయా. ఇక ఈ సినిమాకు ఆదిత్య వర్మ అనే టైటిల్ పెట్టారు.

నిన్న తమిళనాట విడుదలైన ఆదిత్య వర్మ చిత్రానికి కుర్రాళ్ళు బ్రహ్మరథం పట్టారు. అసలే హీరో విక్రమ్ కొడుకాయే అందుకే మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. ఇక నటన పరంగా ధృవ్ కు మంచి పేరు వస్తోంది. ఆదిత్య వర్మ గా అద్భుత నటన కనబరిచాడని కొనియాడుతున్నారు. పేరు తో పాటుగా మంచి వసూళ్లు కూడా వస్తుండటంతో విక్రమ్ పరవశించిపోతున్నాడు. మొత్తానికి తెలుగులోనే కాకుండా హిందీలో , తమిళ్ లో కూడా అర్జున్ రెడ్డి సూపర్ హిట్ కొట్టేసాడు.