నవంబర్ 13 న హీరోయిన్ అర్చన పెళ్లి

Published on Oct 30,2019 10:34 AM

హీరోయిన్ అర్చన ( వేద ) పెళ్లి నవంబర్ 13 న అంగరంగ వైభవంగా జరుగనుంది. హెల్త్ ప్రోడక్ట్స్ కంపెనీ కి వైజ్ ప్రెసిడెంట్ అయిన జగదీశ్ ని ఇష్టపడింది అర్చన. దాంతో ఈనెల 3 న హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. అక్టోబర్ 3 న ఎంగేజ్ మెంట్ జరగడంతో పెళ్లిని నవంబర్ 13 న చేయనున్నారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

తెలుగమ్మాయి అయిన అర్చన అలియాస్ వేద తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , మలయాళ , కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. కెరీర్ పరంగా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది దాంతో పెళ్ళికి సిద్ధమైంది అర్చన.