షాక్ కి గురిచేస్తున్న అనుష్క లుక్

Published on Sep 04,2019 02:27 PM
సాలిడ్ అందాల భామ అనుష్క తాజా లుక్ షాక్ కి గురిచేస్తోంది. సైజ్ జీరో చిత్రం కోసం లావైన అనుష్క పాపం..... అప్పటి నుండి లావు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ భామ మాత్రం లావు తగ్గడమే లేదు. తాజాగా అనుష్క లావుగా దర్శనం ఇవ్వడమే అందుకు కారణం. ఆమధ్య అనుష్క లావు తగ్గి నాజూగ్గా ఉన్నట్లు గా ఓ ఫోటో రిలీజ్ చేశారు. దాంతో అనుష్క ఇంత సన్నగా అయ్యిందేంటి అని అనుకున్నారు అంతా. 
కట్ చేస్తే అనుష్క హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో షాకింగ్ లుక్ లో దర్శనం ఇవ్వడంతో అస్సలు లావు తగ్గలేదని నిరూపితమైంది. తాజాగా ఈ భామ నిశ్శబ్దం అనే చిత్రంలో నటిస్తోంది. భాగమతి చిత్రం తర్వాత అనుష్క చేస్తున్న చిత్రం ఈ నిశ్శబ్దం. ఒకవైపు అనుష్క ఇంకా పెళ్లిచేసుకోవడం లేదు అలాగే మరోవైపు ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోవడం లేదు దాంతో ఈ ఇద్దరి మద్య పుకార్లు షికార్లు చేస్తున్నాయి.