అతడ్నే పెళ్లి చేసుకుంటానంటున్న అనుష్క

Published on Feb 22,2020 12:24 PM

నేను అతడ్నే పెళ్లి చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసింది సాలిడ్ అందాల భామ అనుష్క. ఇంతకీ అనుష్క చేసుకుంటానంటున్న అతడు ఎవరో తెలుసా ? అతడు ఎవరో కాదు తన తల్లిదండ్రులు ఎవరిని చూపించి వాళ్ళని పెళ్లి చేసుకో అని ఆదేశిస్తే ఈ భామ తలవంచుకొని మరీ తాళి కట్టించుకుంటుందట అంతేకాని నాకు ఫలానా వాడు కావాలని అడగనని అంటోంది. కొంత కాలంగా అనుష్క పెళ్లి మీద పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. ప్రభాస్ తో అని , కాదు క్రికెటర్ అని లేదు లేదు బిజినెస్ మెన్ అంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈమధ్య ఈ పుకార్లు మరీ ఎక్కువ కావడంతో వాటికీ చెక్ పెట్టాలని భావించిన అనుష్క నా పెళ్లి నా తల్లిదండ్రుల ఇష్టమే అని తేల్చేసింది. అయితే ఇంతగా పుకార్లు షికారు కావడానికి కారణం ఏంటో తెలుసా ....... ప్రభాస్ కు అలాగే అనుష్క కు పెళ్లి కాకపోవడమే ! ఈ ఇద్దరిదీ అదిరిపోయే జోడీ కావడంతో కొంతకాలంగా ప్రభాస్ - అనుష్క లకు ముడిపెడుతూ పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళ పెళ్లి కావడం లేదు అలాగే ఈ పుకార్లు కూడా ఆగడం లేదు ఎన్నిసార్లు ఖండించినా.