ఇకపై అనుష్క అలాంటి చిత్రాల్లో నటించదట

Published on Nov 17,2019 08:38 AM

సాలిడ్ అందాల భామ అనుష్క కు చారిత్రాత్మక చిత్రాలే ఎక్కువ క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. అరుంధతి , బాహుబలి , బాహుబలి 2 , రుద్రమదేవి లాంటి చిత్రాలు ఆ కోవలో ఉన్నాయి అయితే ఇకపై మాత్రం అలాంటి చారిత్రాత్మక చిత్రాల్లో నటించేది లేదు అంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా ....... మేకప్ కోసం ఎక్కువ సమయం పట్టడమే కాకుండా షూటింగ్ కూడా ఎక్కువ రోజులు సాగుతుండటంతో.

ఇలా ఎక్కువ రోజులు , ఎక్కువ మేకప్ వల్ల తినడంలో తేడాలు వస్తున్నాయి. ఎక్కువ సేపు తినకుండా ఉండటం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయట అందుకే ఇకపై అలాంటి చిత్రాల్లో నటించడం కుదరదు అని తేల్చి చెప్పేస్తోందట అనుష్క. ఇలా కఠిన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈమధ్య రెండు మంచి ప్రాజెక్ట్ లు మిస్ అయ్యిందట. అయినా పర్లేదు నా ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు అని అంటోంది అనుష్క.