మహర్షి చిత్రం నుండి మరో టీజర్

Published on Mar 09,2019 10:07 AM

మహర్షి చిత్రం మళ్ళీ వాయిదాపడటంతో మహేష్ బాబు అభిమానులు చాలా ఆగ్రహంగా ఉన్నారు దాంతో వాళ్ళని సంతోషపరచడానికి మహర్షి చిత్రం నుండి మరో టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈనెల 21 న మహర్షి చిత్రంలోని మరో టీజర్ ని రిలీజ్ చేయనున్నారు ఆ చిత్ర బృందం . ఇప్పటికే మహర్షి టీజర్ ని రిలీజ్ చేయగా దానికి మంచి స్పందన వచ్చింది అయితే ఈసారి మాత్రం కేవలం మహేష్ ఫ్యాన్స్ ని సంతోష పెట్టడానికి మాత్రమే టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు . 

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు . మహర్షి చిత్రాన్ని మే 9 న రిలీజ్ చేయనున్నారు .