కల్కి టీజర్ రేపే

Published on Apr 09,2019 03:32 PM

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తాజాగా నటిస్తున్న చిత్రం '' కల్కి ''. ఈ చిత్ర టీజర్ ని రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం వెల్లడించింది . ఆ భగవంతుడి పదో అవతారం ఈ కల్కి అంటూ సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తున్నారు . అ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . 

ఇప్పటికే ఫిబ్రవరిలో డాక్టర్ రాజశేఖర్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కు అలాగే టీజర్ కు మంచి స్పందన వచ్చింది దాంతో మరో టీజర్ ని రెడీ చేస్తున్నారు . రేపు ఈ టీజర్ విడుదల కానుంది . ఇక సినిమాని మే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . స్టార్ హీరో అయినప్పటికీ సరైన సక్సెస్ లేక రేసులో లేకుండాపోయిన రాజశేఖర్ గరుడ వేగ చిత్రంతో మళ్ళీ గాడిలో పడ్డాడు . ఇక ఇపుడేమో కల్కి చిత్రంతో తప్పకుండా హిట్ కొడతానన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు రాజశేఖర్ . 

1980 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై రాజశేఖర్ కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుంది . రాజశేఖర్ ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామి కావడం విశేషం . తన ఇద్దరు కూతుర్లు శివాని , శివాత్మిక లు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు కల్కి చిత్రానికి .