మరో వారసుడు హీరో అవుతున్నాడు

Published on Aug 26,2019 12:21 PM
నటుడు బ్రహ్మాజీ కొడుకు కూడా హీరోగా నటిస్తున్నాడు. తెలుగు సినిమారంగంలో పలువురు వారసులు హీరోలుగా చెలామణి అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వారసుల సరసన బ్రహ్మాజీ కొడుకు కూడా చేరుతున్నాడు. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. హెదరాబాద్ పరిసర ప్రాంతల్లో షూటింగ్ పూర్తి కావడంతో ఇక తదుపరి షెడ్యూల్ కోసం అమలాపురం వెళ్తున్నారు. 

బ్రహ్మాజీ కి ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి , అలాగే మంచి పేరు ఉంది దాంతో తన తనయుడు సంజయ్ కూడా హీరోగా నిలదొక్కుకుంటాడనే ఆశతో ఉన్నాడు. అయితే వారసులుగా వచ్చిన వాళ్లలో చాలామంది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు మరి బ్రహ్మాజీ కొడుకు ఈమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి .