మరో బాలీవుడ్ భామని పడేసిన దేవరకొండ

Published on Feb 28,2020 01:01 PM

విజయ్ దేవరకొండ ఈ పేరుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు ! కుర్రాళ్ళు ఈ హీరోకి ఫిదా అవ్వడం వేరు కానీ రౌడీ ఇమేజ్ ఉన్న ఈ హీరోకు బాలీవుడ్ హీరోయిన్ లు సైతం పడిపోతున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ , అలియా భట్ , కైరా అద్వానీ లను తన బుట్టలో వేసుకున్న ఈ క్రేజీ హీరో తాజాగా మరో బాలీవుడ్ భామ అనన్య పాండే ని కూడా వేసుకున్నాడు తన బుట్టలో. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.

కాగా ఆ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే ని తీసుకున్నారు. ఒక షెడ్యూల్ కూడా అయ్యింది దాంతో విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది ఈ హాట్ భామ. విజయ్ స్మార్ట్ అండ్ కూల్ , డైలాగ్ డెలివరీ లో ప్రత్యేకత ఉంది అలాగే మంచి మెళుకువలు కూడా ఉన్నాయి విజయ్ లో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతోంది. తక్కువ సమయంలో హాట్ భామ అనన్య మంచి ఫ్రెండ్ కావడంతో ఈ హీరోలో ఏదో మ్యాజిక్ ఉన్నట్లుందని అంటున్నారు.