ఆది మరో దెబ్బ తిన్నాడు

Published on Sep 06,2019 03:15 PM

హీరో సాయికుమార్ తనయుడిగా ప్రేమ కావాలి అంటూ 2011 లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు ఆది సాయికుమార్. అయితే మొదటి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు కానీ ఆతర్వాత ఆది నటించిన చిత్రాలన్నీ ప్లాప్ లే అయ్యాయి దాంతో పాపం ఈ హీరోకు కెరీర్ లేకుండాపోయింది. మొత్తంగా ఎనిమిదేళ్ల కెరీర్ లో ప్రేమ కావాలి ఒక్కటే హిట్టు ఇక అప్పటి నుండి సక్సెస్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ పాపం సక్సెస్ మాత్రం దక్కడం లేదు ఈ హీరోకు.

తాజాగా ఆది సాయికుమార్ నటించిన జోడి చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా ప్లాప్ జాబితాలో చేరింది. జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన జోడి చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. అయితే షరా మామూలుగానే జోడి సినిమా ప్లాప్ అయ్యింది. దాంతో ఈ కుర్ర హీరో ఆశలన్నీ అడియాసలే అయ్యాయి.