డిప్రెషన్ లో రవితేజ హీరోయిన్

Published on Dec 04,2019 12:33 PM

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన డాన్ శీను చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన భామ '' అంజనా సుఖాని '' డిప్రెషన్ లో ఉందట ఇన్నాళ్లు. 2010 లో విడుదలైన డాన్ శీను తెలుగులో మంచి హిట్ అయ్యింది కూడా. అయితే అంజనా సుఖాని సెకండ్ హీరోయిన్ గా నటించడంతో ఈ భామని తెలుగు వాళ్ళు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకుండాపోయాయి. ఇక అదే సమయంలో అంజనా సుఖాని మేనత్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే ఆమెకు సేవ చేయడంతోనే పుణ్యకాలం కాస్త అయిపొయింది.

అయితే అంజనా సుఖాని ఎంత సేవ చేసినప్పటికీ ఈ భామ ఆంటీ చనిపోవడంతో ఆ దుఃఖంతో మరికొంత కాలం సినిమాలకు దూరమైంది. అంటే ఓవరాల్ గా 9 సంవత్సరాలు సినిమాలకు దూరమయ్యింది పాపం. డిప్రెషన్ కి లోను కావడం వల్ల 9 ఏళ్ల కెరీర్ ని మిస్ చేసుకుంది పాపం. ఇపుడు మళ్ళీ సినిమాల్లో నటిస్తానని అంటోంది కానీ వేషాలు ఇచ్చేది ఎవరో ?