తమిళ హీరోకు షాక్ ఇచ్చిన అంజలి

Published on Feb 07,2019 11:48 AM

తమిళ హీరో జై ని అంజలి ప్రేమిస్తున్నట్లు అప్పట్లో వార్తలు కోకొల్లలు గా వచ్చాయి . అయితే అప్పట్లో ఈ ఇద్దరూ కలిసి బాగానే రచ్చ రచ్చ చేసారు కానీ ఇప్పుడు అంజలి మాటలు వింటే షాక్ అవ్వడం ఖాయం . ఎందుకంటే జై ని నేను ప్రేమించలేదు అంటూ ఓపెన్ గా చెప్పేసింది . గతకొంత కాలంగా ఈ ఇద్దరూ విడిపోయారని తెలుస్తోంది . 

అయితే జర్నీ చిత్రంలో నటించినప్పటి నుండి ప్రేమలో పడ్డారట ! ఆ తర్వాత కొంతకాలం సహజీవనం కూడా చేసారని..... ఇక రేపో మాపో పెళ్లి చేసుకోవడం ఖాయమని వార్తలు వచ్చాయి కట్ చేస్తే నేను జై ని ప్రేమించలేదని అంటోంది అంజలి . ఈ భామ తెలుగమ్మాయి అయితే తెలుగులో కంటే తమిళ్ లోనే ఎక్కువ ఛాన్స్ లు కొట్టేసింది అంజలి .