హీరోయిన్ అంజలా ఝవేరి భర్తే ఈ విలన్

Published on Dec 03,2019 02:53 PM
స్టైలిష్ విలన్ పాత్రలకు పెట్టింది పేరు తరుణ్ రాజ్ అరోరా. అస్సామ్ లో పుట్టినప్పటికీ అటు బాలీవుడ్ చిత్రాల్లో ఇటు సౌత్ చిత్రాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసాడు తరుణ్ రాజ్ అరోరా. అయితే ఈ విలన్ ఎవరి భర్తో తెలుసా ....... హీరోయిన్ అంజలా ఝవేరి భర్త. తెలుగులో ''ప్రేమించుకుందాం రా '' , '' సమరసింహారెడ్డి '', '' చూడాలని ఉంది '' , ''రావోయి చందమామ '','' దేవిపుత్రుడు '' , '' ఆప్తుడు '' వంటి చిత్రాల్లో నటించింది అంజలా ఝవేరి.

ఈ భామని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తరుణ్ రాజ్ అరోరా. మోడల్ అయిన తరుణ్ రాజ్ అరోరా బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించాడు. ఆసమయంలో అంజలా ఝవేరి ని చూసిన తరుణ్ తన ప్రేమ విషయాన్ని చెప్పి ముగ్గులోకి దించాడట. ఇంకేముంది అంజలా ఝవేరి ఒప్పుకుంది పెళ్లి చేసుకుంది. హాయిగా కాపురం చేసుకుంటున్నారు ఈ ఇద్దరూ కాకపోతే పిల్లలు వద్దు అని ముందే అనుకున్నారట ఎందుకో !