అంజలి కెరీర్ ని నాశనం చేసిన హీరో

Published on Nov 23,2019 06:22 PM

హీరోయిన్ అంజలి కెరీర్ ని తమిళ హీరో జై నాశనం చేసాడని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు తమిళ నిర్మాత నందకుమార్. అంజలి - జై జంటగా బెలూన్ అనే చిత్రాన్ని నిర్మించాడు నందకుమార్. అయితే ఆ సినిమా ప్లాప్ అయ్యింది అలాగే నందకుమార్ కు భారీగా నష్టాలు వచ్చాయి కూడా. ఇక ఇప్పుడేమో తమిళనాట అంజలి కి పెద్దగా డిమాండ్ లేకుండాపోయింది అంతేకాదు చేతిలో సరైన సినిమాలు కూడా లేవు. దీనంతటికి కారకుడు హీరో జై అని అంటున్నాడు నందకుమార్.

అంజలి కెరీర్ ని నాశనం చేసాడని , అలాగే ఆమెకు సినిమాలు రాకుండా అడ్డుపడుతున్నాడని పాపం మంచి మనసున్న అంజలి ని ప్రేమ పేరుతో వాడుకొని ఇప్పుడు మొహం చాటేసాడని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. తెలుగమ్మాయి అయిన అంజలి కొన్నాళ్ల పాటు హీరో జై తో ప్రేమ వ్యవహారాలు సాగించడమే కాకుండా సహజీవనం కూడా చేసిన విషయం తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు వాళ్లిద్దరూ ఉప్పు నిప్పు లా తయారయ్యారు.