పెళ్ళికి సిద్దమైన మరో హీరోయిన్

Published on Jan 28,2019 02:40 PM

అనీషా ఆంబ్రోస్ అనే హీరోయిన్ పెళ్ళికి సిద్ధమైంది . గుణ అనే వ్యక్తి తో అనీషా ఆంబ్రోస్ కు వివాహ నిశ్చితార్థం జరిగింది . అలియాస్ జానకి చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామకు తెలుగు , కన్నడ , మలయాళ బాషలలో మొత్తం 14 చిత్రాల్లో నటించింది అయితే ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ ఇవ్వలేకపోయింది అనీషా కు . దాంతో ఈ భామ ఎన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది . 

అయితే పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించే ఛాన్స్ లభించింది కానీ చివరి నిమిషంలో ఆ ఛాన్స్ ని కాజల్ అగర్వాల్ తన్నుకుపోయింది . దాంతో ఈ భామ ఆశలన్నీ అడియాసలు అయ్యాయి . ఇంకేముంది కెరీర్ ఎలాగూ లేకుండా పోయింది కాబట్టి హాయిగా పెళ్లి చేసుకొని ఓ ఇంటిదాన్ని అవ్వాలని డిసైడ్ అయ్యిందట అందుకే గుణ అనే వ్యక్తిని పెళ్లాడాలని నిర్ణయించుకుంది . ఎంగేజ్ మెంట్ అయ్యింది . త్వరలోనే పెళ్లి జరుగనుంది అనీషా ఆంబ్రోస్ ది .