మహేష్ బాబుతో అనిల్ రావిపూడి

Published on Feb 06,2019 03:45 PM

ఎఫ్ 2 తో ప్రభంజనం సృష్టించిన దర్శకుడు అనిల్ రావిపూడి . అయితే సినిమా రంగం సక్సెస్ వెంట పరుగెత్తే లోకం కాబట్టి అనిల్ రావిపూడి వరుసగా నాలుగు చిత్రాలు పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 సక్సెస్ సాధించడంతో ఈ డైరెక్టర్ వెంట పడుతున్నారు నిర్మాతలు . ఎఫ్ 2 సంచలన విజయం సాధించిన తర్వాత అనిల్ రావిపూడి కి పెద్ద ఎత్తున తాకిడి మొదలయ్యింది . 

ఇప్పటికే పలువురు నిర్మాతలు కర్చీఫ్ వేయగా తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది . ఇంతకుముందు మహేష్ బాబు హీరోగా నటించిన ఆగడు చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ చేసాడు అనిల్ కానీ పటాస్ ఛాన్స్ రావడంతో మధ్యలోనే వెళ్ళిపోయాడు . కట్ చేస్తే ఇప్పుడు డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు దాంతో మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అనిల్ రావిపూడి .