మహేష్ బాబుతో అనిల్ రావిపూడి

Published on Jan 29,2019 01:06 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు దర్శకులు అనిల్ రావిపూడి . పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 చిత్రాలతో వరుసగా నాలుగు సూపర్ హిట్స్ సాధించిన దర్శకుడు అనిల్ రావిపూడి . వరుసగా నాలుగు సూపర్ హిట్స్ కొట్టడంతో అనిల్ రావిపూడి కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . అనిల్ తో సినిమాలు నిర్మించడానికి పలువురు నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు . 

ఇక మహేష్ బాబు తో సినిమా చేయాలనీ అనిల్ రావిపూడి కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు . అలాగే మహేష్ బాబు కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించాలని ఆసక్తి చూపిస్తున్నాడు . అయితే అతడికి ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి కాబట్టి అవి అయ్యాక ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చు .