అనిల్ రావిపూడి చేసేది కరెక్టేనా ?

Published on Jan 24,2019 12:00 PM

పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఇక ఇప్పుడేమో ఎఫ్ 2 తో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ లను అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి . అయితే నాలుగు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేయాలి కానీ ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట అనిల్ దాంతో ఈ దర్శకుడు చేసేది కరెక్టేనా ? అన్న మాట వినబడుతోంది . 

మంచి సక్సెస్ లో ఉన్నప్పుడు దాన్ని మరింతగా క్యాష్ చేసుకోవడానికి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తారు కానీ అనిల్ మాత్రం స్టార్ హీరోయిన్ తో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది . హీరోయిన్ తో చేసినా కథ , కథనం ప్రేక్షకులకు నచ్చితే తప్పకుండా ఆదరిస్తారు అయితే హీరో తో చేస్తే అనిల్ మరింతగా ఎదిగే ఛాన్స్ ఉంటుంది . అందుకే అనిల్ చేస్తోంది కరెక్టేనా ? అన్న మాట వినబడుతోంది .