హీరోగా మారిన యాంకర్ ప్రదీప్

Published on Mar 23,2019 12:06 PM

బుల్లితెరపై యాంకర్ గా సత్తా చాటుతున్న ప్రదీప్ హీరోగా మారుతున్నాడు . తెలుగులో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు ప్రదీప్ అయితే ఎప్పటినుండో  హీరోగా నటించాలని తహతహలాడాడు ప్రదీప్ అయితే ఇన్నాళ్లకు అతడి కోరిక నెరవేరుతుంది . దర్శకులు సుకుమార్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు . 

అయితే ఈ సినిమా 1947 నాటి కాలం కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది . ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది . త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారట . బుల్లితెరపై యాంకర్ గా రాణించిన ప్రదీప్ హీరోగా సక్సెస్ అవుతాడా ? లేదా చూడాలి .