అనసూయ కోరిక తీర్చుతున్న పవన్ కళ్యాణ్

Published on Feb 04,2020 08:19 PM

హాట్ భామ అనసూయ కోరిక తీరుస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . అనసూయ కోరిక ఏంటి ? పవన్ కళ్యాణ్ తీర్చడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇంతకీ అనసూయ కోరిక ఏంటో తెలుసా ....... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలనేది అనసూయ కోరిక. అయితే చాలా సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని తహతహలాడింది కానీ ఆ ఛాన్స్ లభించలేదు కట్ చేస్తే పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళాడు దాంతో మరింత నిరాశ చెందింది.

ఇక అంతే అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటించడం అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అనసూయ కు మంచి పాత్ర లభించడంతో చాలా సంతోషంగా ఉంది అనసూయ. ఈ చిత్రంలో అనసూయకు చాలా మంచి పాత్ర లభించిందట. అభిమాన హీరో సినిమాలో ఛాన్స్ రావడమే కాకుండా మంచి క్యారెక్టర్ కూడా లభించడంతో ఉప్పొంగిపోతోంది అనసూయ.