స్పైసీ రోల్ లో అనసూయ

Published on Dec 18,2019 09:30 PM

హాట్ భామ అనసూయ రంగమార్తాండ చిత్రంలో స్పెసీ రోల్ పోషిస్తోందని ట్వీట్ చేసాడు దర్శకులు కృష్ణవంశీ. తాజాగా కృష్ణవంశీ రంగమార్తాండ అనే రీమేక్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. మరాఠీ లో సంచలన విజయం సాధించిన నటసామ్రాట్ చిత్రాన్ని తెలుగులో రంగమార్తాండ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు కృష్ణవంశీ. ప్రకాష్ రాజ్ - రమ్యకృష్ణ , బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో హాట్ భామ అనసూయ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

అయితే ఈ భామ శృంగార తారగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అనసూయ స్పైసీ క్యారెక్టర్ పోషిస్తోందని పేర్కొంటూ నిండైన చీరలో ఉన్న అనసూయ ఫోటో ని షేర్ చేసాడు కృష్ణవంశీ. చీరలో కూడా సెక్సీ నెస్ ని అద్భుతంగా చూపించగలదు అనసూయ. ఇప్పటికే బుల్లితెర పై సంచలనం సృష్టిస్తున్న ఈ భామ రంగమార్తాండ తో మరింత సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వెండితెర మీద చాలా సెలెక్టివ్ గా పాత్రలను , చిత్రాలను ఎంచుకుంటోంది అనసూయ.