యాక్షన్ కింగ్ అర్జున్ అంటే అనసూయకు చాలా ఇష్టమట

Published on Apr 30,2020 04:45 PM
యాక్షన్ కింగ్ అర్జున్ అంటే నాకు చాలా చాలా ఇష్టమని అంటోంది హాట్ భామ అనసూయ. అర్జున్ నటించిన జెంటిల్ మెన్ చిత్రాన్ని చూసి ఫిదా అయ్యిందట. తన మనసుని అర్జున్ కు అర్పించిందట. అప్పటి నుండి ఈ హీరో అంటే పిచ్చి ప్రేమ అంట. అయితే అనసూయ యాక్టింగ్ కు వచ్చిన సమయంలో అర్జున్ సినిమాలు తగ్గించాడు అలాగే స్టార్ డం పడిపోవడంతో సినిమాలు కూడా తగ్గాయి.

సినిమాల్లోకి రాకముందు అనసూయ చాలా ట్రై చేసిందట కానీ కుదరలేదు . అప్పట్లో ఎన్టీఆర్ నటించిన నాగ అనే చిత్రంలో కనిపిస్తుంది అనసూయ కానీ ఆమెని అప్పట్లో ఎవరూ అంతగా ఎంకరేజ్ చేయలేదు. కట్ చేస్తే పదేళ్ల తర్వాత బుల్లితెరపై సంచలనం సృష్టిస్తోంది హాట్ యాంకర్ గా. పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ గ్లామర్ లో యంగ్ బ్యూటీ లతో పోటీపడుతోంది అనసూయ. అలాగే సినిమాల్లో కూడా నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.