అనసూయ ఆగ్రహంతో ఊగిపోతోంది

Published on Nov 24,2019 09:46 PM

హాట్ యాంకర్ అనసూయ ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ భామకు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ....... జబర్దస్త్ ప్రోగ్రాం అనసూయ మానేస్తోంది అని వార్తలు స్ప్రెడ్ కావడమే ! బుల్లితెర పై సంచలనం సృష్టించిన షో జబర్దస్త్. ఆ షోకు అనసూయ గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. అనసూయ అందాలు జబర్దస్త్ కు మరింత ప్లస్ అయ్యాయి. అయితే సడెన్ గా ఈ షో నుండి జడ్జి గా వ్యవహరిస్తున్న నాగబాబు మానేస్తున్నానని పేర్కొనడంతో అనసూయ కూడా జబర్దస్త్ మానేస్తోందని వార్తలు రావడమే !

ఈ వార్తలు అనసూయ కు విపరీతమైన కోపం తెప్పించాయి. అందుకే ఇలాంటి వార్తలు రాసిన వాళ్లపై మండిపడుతోంది అనసూయ. నేను జబర్డస్త్ మానేయడం లేదని ఖరాఖండిగా చెప్పింది. అసలు విషయం తెలుసుకోకుండా ఇలా ఎలా రాస్తారని అంటోంది అనసూయ. ఇక నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు మరి అతడి స్థానంలో జడ్జిగా ఎవరు రానున్నారో ఈ గురువారం తేలనుంది.