అనసూయ గుండె బద్దలైందట

Published on Aug 24,2019 10:40 AM
హాట్ భామ అనసూయ తన గుండె బద్దలైంది అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది . ఇంతకీ అనసూయ ఇంతగా బాధపడటానికి కారణం ఏంటో తెలుసా ...... అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అగ్నికి ఆహుతి కావడమే ! గత రెండు వారాలుగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ దగ్దమౌతోంది . అడవిలో రగులుకున్న కార్చిచ్చు అడవి మొత్తాన్ని దహించి వేస్తోంది . ఈ ఘోర సంఘటనలో వన్య ప్రాణులతో పాటుగా అడవి కూడా దగ్ధం అవుతోంది . 

మానవ మనుగడకు అడవులు , వన్య ప్రాణులు కూడా అవసరమే ! అయితే నాగరికత పేరుతో జరుగుతున్న అభివృద్ధి మానవాళి వినాశనానికి దారితీస్తోంది . దాంతో ఏమాత్రం దయ , జాలి లేని మా మానవ జాతిని క్షమించద్దు అని వేడుకుంటోంది అనసూయ .