అనసూయని ఆ సినిమా నుండి తొలగించారట

Published on Apr 29,2020 06:05 PM
హాట్ భామ అనసూయని ''పుష్ప '' సినిమా నుండి తొలగించారని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప చిత్రంలో కీలక పాత్రకు అనసూయని ఎంపిక చేశారట దర్శకులు సుకుమార్. అయితే మన సినిమా కేవలం తెలుగులో మాత్రమే విడుదల కావడం లేదు కాబట్టి 5 భాషల్లో తెలిసిన భామని పెడితే మంచిదని సలహా ఇచ్చాడట హీరో అల్లు అర్జున్ దాంతో అనసూయని తొలగించి ఆమె స్థానంలో మరొకరిని తీసుకునే ఆలోచన చేస్తున్నారట.


రంగస్థలం చిత్రంలో సుకుమార్ అనసూయకు చాలామంచి పాత్ర ఇచ్చాడు. గ్లామర్ పాత్ర అయినప్పటికీ పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండే పాత్ర ఇవ్వడంతో సుకుమార్ అంటే అనసూయకు చాలా ఇష్టం దాంతో అడగ్గానే పుష్ప చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది. అయితే అల్లు అర్జున్ మూలంగా అనసూయని తొలగించారని తెలుస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టాకా పుష్ప సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అల్లు అర్జున్ ఇందులో గంధపు చెక్కల స్మగ్లర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.