విలన్ పాత్రలో అనసూయ

Published on Feb 18,2020 07:02 PM

హాట్ భామ అనసూయ విలన్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ! అది కూడా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నిర్మించే చిత్రంలో నట ! విజయ్ దేవరకొండతో తీవ్రంగా విభేదించింది అనసూయ అర్జున్ రెడ్డి విషయంలో. కట్ చేస్తే ఆ తర్వాత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు అందుకే మీకు మాత్రమే చెప్తా చిత్రంలో అనసూయ నటించింది. మీకు మాత్రమే చెప్తా చిత్రాన్ని నిర్మించింది విజయ్ దేవరకొండ అన్న సంగతి తెలిసిందే.

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఆ సినిమా ప్లాప్ అయ్యింది. కట్ చేస్తే అనసూయ విలన్ గా విజయ్ నిర్మించే చిత్రంలో నటించడానికి ఒప్పుకుందట. ఇంతకుముందు రంగస్థలం చిత్రంలో విభిన్న పాత్ర పోషించి మెప్పించింది అనసూయ. దాంతో ఈ హాట్ భామ తో డిఫరెంట్ పాత్రలు చేయించాలనే ఆలోచనలో ఉన్నారు పలువురు దర్శక నిర్మాతలు. బుల్లితెరపై తన అందాలతో సంచలనం సృష్టిస్తోంది అనసూయ. అయితే వెండితెర మీద మాత్రం ఆ స్థాయిలో అందాలను ఆరబోయడం లేదు.